నేడు పోలవరంపై కీలక సమావేశం జరగనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు అధికారులు వర్చువల్ గా భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులు హాజరు కానున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాష్ట్రాల అభ్యంతరాలపై చర్చించనున్నారు. ఈ భేటీకి ఏపీ సహా 4 రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. వారితో కేంద్రం ఈ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది.