ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా బ్రెడ్ తినే అలవాటు మీకు ఉందా? చాలా మందికి అవుననే సమాధానం వస్తుంది. కానీ ప్రతిరోజూ బ్రెడ్ తినడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. బ్రెడ్ తయారు చేయడానికి పిండిలో పొటాషియం బ్రోమేట్ను ఉపయోగిస్తారు. ఇది తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. రోజూ బ్రెడ్ తినడం వల్ల శరీరంలో చక్కెర శాతం పెరుగుతుంది. కార్బోహైడ్రేట్లు పెరగడం వల్ల బరువు కూడా పెరుగుతారు.