విశాఖపట్నం: గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నాతవరం మండలం తాండవం జలాశయం నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. ఈనేపాథ్యంలో ఏ సమయంలోనైనా స్పిల్ వే గేట్లు ద్వారా నదిలోని నీటిని విడుదల చేస్తామని తాండవం ప్రాజెక్టు ఇంటికి రాజేంద్ర కుమార్ తెలిపారు గురువారం ఆయన తాండవ రిజర్వాయర్ ను పరిశీలించారు. గరిష్ట నీటిమట్టం 380 అడుగులు కాగా 377. 50 అడుగులకు చేరినట్లు ఆయన తెలిపారు.