ప్రత్యేక హెూదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని రాష్ట్రానికి సంజీవిని అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనేసాధ్యమవుతుందని కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడింట్, భారత్ జోడో యాత్ర రాష్ట్ర సమన్వయకర్త తులసి రెడ్డి అన్నారు. గురువారం కడపజిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హెూదా ముగిసిన ఆధ్యాయమని చెప్పి బిజెపి రాష్ట్రానికి మోసం చేసిందని తులసి రెడ్డి అన్నారు. ప్రాంతీయ పార్టీలైన జగన్ పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలకు ప్రత్యేక హెూదా ఇచ్చే శక్తి లేదు తెచ్చే శక్తి లేదన్నారు.
హోదా వలన ఉపాధి హామీ పథకం లాంటి కేంద్ర ప్రయోజత పథకాలతో 90 శాతం నిధులు కేంద్రం భరిస్తుంది. విదేశీ ఆర్థిక సంస్థల సహకారంతో రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టులకు హోదా వలన రాష్ట్రాలలో కేంద్రం 100శాతం నిధులు భరిస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హెూదా ఫైలు పైనే ఉంటుందని ప్రాంతీయ పార్టీల ఉచ్చులో పడొద్దని తులిసిరెడ్డి సూచించారు. అక్టోబర్ 18, 19, 20, 21 తేదీలలో కర్నూలు జిల్లాలోని ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గంలో పాదయాత్ర ఉంటుందని ఇందులో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు విష్ణు ప్రీతంరెడ్డి, పిసిసి డెలిగేట్స్ బండి జకరయ్య, సత్తార్, బొజ్జ తిరుమలేష్, వెంకటరమణారెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కులాయప్ప, శ్రీనివాసులు, చార్లెస్, బాబు, సాదిక్, మల్లికా బేగం, ఉత్తన్న, అమర్, ఓబులేసు, పుల్లయ్య, అబ్దుల్ రసూల్ తదితరులు పాల్గొన్నారు.