విశాఖపట్నం: నర్సీపట్నం మండలం దుగ్గాడ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వరాహనదిలో ఓ రైతు గల్లంతయ్యాడు. దుగ్గాడ గ్రామానికి చెందిన రైతు నిద్దుర సత్తిబాబు(35) గురువారం ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని దాటి పొలానికి వెళుతుండగా ప్రవాహ దాటికి కొట్టుకుపోయాడు. దీంతో సత్తిబాబు ఆచూకీ గాలింపు చర్యలు చేపట్టారు. దగ్గాడ గ్రామానికి చెందిన రైతుల పొలాలన్నీ నది అవతల ఉండడంవల్ల రోజూ నదిని దాటి వెళుతుంటామని రైతులు తెలిపారు.