బ్రహ్మంగారి మఠం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారిని దర్శించుకునేందుకు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ తదితర ప్రాంతాలనుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. యాత్రికులకు, స్థానిక ప్రజలకు దీర్ఘకాలిక సమస్య అయిన బస్టాండ్ నిర్మాణం చేపట్టకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఐదు రోడ్ల కూడలిలో బస్సులు నిలపడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ఇకనైనా అధికారులు స్పందించి త్వరగా బస్టాండ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు విన్నవిస్తున్నారు.