విశాఖపట్నం వెళ్తున్న కారు అదుపు తప్పి పక్కనున్న సీసీ పుటేజీ స్తంభాన్ని ఢీకొని విభాగినిపై పడింది. ఈ ఘటనలో తండ్రి, కూతురు మృతిచెంది. దూబచర్ల జాతీయ రహదారిపై గురువారం ఈ ఘటన జరిగింది. ఈనాడు కథనం ప్రకారం.. బావినేని వెంకటకృష్ణయ్య(84), ఆయన కుమార్తె సూర్యదేవర అరుణ(59), అల్లుడు మురళీధర్, మనుమడు మణిదీప్, మణిదీప్ భార్య దివ్యశ్రీ కృష్ణాజిల్లా విజయవాడలోని టిక్కల రోడ్డులో నివాసం ఉంటున్నారు.
వెంకటకృష్ణయ్య పెద్ద అల్లుడు సంవత్సరికం నిమిత్తం వారంతా గురువారం ఉదయం ఒకే కారులో విశాఖపట్నం బయలుదేరారు. కారునల్లజర్ల మండలం దూబచర్ల జాతీయరహదారి వద్దకు వచ్చేసరికి వర్షాలకు రోడ్డుపై నీరు చేరడంతో డ్రైవింగ్ చేస్తున్న మణిదీప్ సడన్ బ్రేక్ వేశారు. కారు అదుపుతప్పి పక్కనున్న సీసీ పుటేజీ స్తంభాన్ని ఢీకొని విభాగినిపై పడింది. దీంతో వెంకటకృష్ణయ్య, అరుణ అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాలను పంచనామా నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై అయ్యప్పరెడ్డి తెలిపారు.