గుంటూరు జిల్లాలో ఆరోగ్యశ్రీ కేసులు ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య సంచాలకులు వినోద్ కుమార్ సూచించారు. గురువారం జూన్ కాన్ఫరెన్స్ లో ద్వారా గుంటూరు జీజీహెచ్ సూపర్ సూపరింటెండెంట్ ప్రభావతితో మాట్లాడారు. అన్ని విభాగాల్లోనూ ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు చికిత్స అందే విధంగా పర్యవేక్షించాలన్నారు. ప్రయోగశాలల నుంచి పరీక్షల నివేదికలు వేగంగా వచ్చే విధంగా చూడాలన్నారు.