గుంటూరు రేంజ్ పరిధిలో నలుగురు సీఐలను బదిలీ చేస్తూ డిఐజి త్రివిక్రమ వర్మ గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. పామూరు సర్కిల్ సీఐగా పనిచేస్తున్న శ్రీనివాసరావును కావలికి, కావలిలో పనిచేస్తున్న కాటూరి శ్రీనివాసరావును పామూరు సర్కిల్ బదిలీ చేశారు. రేంజ్ కార్యాలయం లో పనిచేస్తున్న మల్లి నాగేశ్వరరావును ఆత్మకూరు సర్కిల్, ఒంగోల్ డిటిసిలో పనిచేస్తున్న సీతారామయ్యను నెల్లూరు దర్గా మిట్ట పీఎస్ కు బదిలీ చేశారు.