కృష్ణా, తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో శుక్రవారం శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ఇన్‌ఫ్లో 76, 933 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 94, 285 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ప్రాజెక్ట్ కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.