ఝార్ఖండ్‌లోని డుమ్కా జిల్లా బాల్కీ గ్రామంలో దారుణం జరిగింది. రాజేశ్, ఓ యువతి మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. రాజేష్ ఇటీవలే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ ప్రియురాలిని రెండో పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. దీనికి ప్రియురాలు ఒప్పుకోలేదని శుక్రవారం ఆమెను కొట్టి, ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాధితురాలు పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.