కావలసిన పదార్థాలు:
పాలకూర: ఒక కట్ట, యాపిల్: ఒకటి, నారింజ: ఒకటి, పనీర్: పావు కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, బాదం, జీడిపప్పు, కిస్మిస్: పావు కప్పు, పుదీనా, కొత్తిమీర తురుము: కొద్దిగా, ఆలివ్ నూనె: రెండు టేబుల్ స్పూన్లు, తేనె: ఒక టేబుల్ స్పూన్, లవంగాలు: రెండు, మిరియాల పొడి: పావు టీ స్పూన్, ఉప్పు: తగినంత.
తయారీ విధానం:
ఒక గిన్నెలో ఆలివ్ ఆయిల్, తేనె, లవంగాలు, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. మరొక గిన్నెలో పాలకూర, చిన్నగా తరిగిన యాపిల్, నారింజ, ఉల్లిగడ్డ, పనీర్ ముక్కలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు, కిస్మిస్, పుదీనా, కొత్తిమీర వేయాలి. ముందుగా కలిపి పెట్టుకున్న తేనె మిశ్రమాన్ని కూడా వేసి కలిపితే ‘పాలక్ ఫ్రూట్ సలాడ్’ రెడీ.