ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ చెల్లింపులతో బస్సుల్లో టిక్కెట్లను విక్రయించాలని సంస్థ నిర్ణయించింది.బస్ టిక్కెట్లుకు చెల్లించాల్సిన డబ్బును యూపీఐ పేమెంట్ల ద్వారా ప్రయాణికులు చెల్లించేలా ఆర్టీసీ కల్పించింది.విశాఖపట్నం నుంచి నడిచే 97 సర్వీసుల్లో ఈ కొత్త తరహా సదుపాయాన్ని తొలుత అందుబాటులోకి తీసుకురానున్నారు. దళల వారీగా అన్ని బస్సుల్లో యూపీఐ చెల్లింపులు అందుబాటులో ఉంచుతామని సంస్థ తెలిపింది.