ఉద్యోగాల కుంభకోణంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్, రబ్రీ దేవితో పాటు మరో 14 మందిపై సీబీఐ శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేసినట్లు పీటీఐ నివేదించింది.ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీతో పాటు ఆయన కుమార్తెలు మిసా యాదవ్, హేమా యాదవ్‌లకు రైల్వేలో రిక్రూట్‌మెంట్ పొందిన కొంతమంది వ్యక్తుల నుంచి భూమి ప్లాట్లు లంచంగా ఇచ్చారని సీబీఐ పేర్కొంది. 2004-2009 మధ్యకాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగింది.