గుంటూరు: ఆర్థిక ఇబ్బందులతో పిడుగురాళ్లలో గోపవరపు వెంకటేశ్వర్లు అంజనాదేవి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గోపవరపు వెంకటేశ్వర్లు రైస్ మీల్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు వీరికి ఇద్దరు కుమారులు వీళ్ళు ఇద్దరు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. వ్యాపారంలో నష్టం రావటంతో శనివారం తెల్లవారు జామున దంపతులు ఇద్దరు ఇంట్లో ఉరి వేసుకొని బలన్మరనానికి పాల్పడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.