బాలిక అదృశ్యంపై మాచర్ల పోలీస్ స్టేషన్లో శుక్రవారం కేసు నమోదు అయింది. మాచర్ల పట్టణం 20వ వార్డుకు చెందిన కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తి తన కుమార్తెను మాచర్ల మండలంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో చేర్పించారు. 15 ఏళ్ల వయసు గల బాలిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నది. కాగా గత నెల 30వ తేదీన ఆ బాలిక ఇంటి నుండి వెళ్లిపోయింది. దీనిపై తల్లిదండ్రులు శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.