మహిళల ఆసియా కప్ 2022లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత మహిళల జట్టుకు పాకిస్థాన్ రూపంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. లీగ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. 24 గంటలు గడవకముందే భారత్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఆతిథ్య బంగ్లాదేశ్ మహిళల జట్టుతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్ నుంచి రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌కు విశ్రాంతినిచ్చారు. దీంతో స్మృతి మంధాన తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా మూడు మార్పులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌తో పాటు రాధా యాదవ్, హేమలత విశ్రాంతి తీసుకున్నారు. వారి స్థానాల్లో స్నేహ రాణా, కిరణ్ నవ్ గిరే, షఫాలీ వర్మలను తుది జట్టులోకి తీసుకున్నారు. అదే సమయంలో బంగ్లాదేశ్ కూడా ఒక మార్పు చేసింది. సాహిమా సుల్తానాను మినహాయించి లతను తుది జట్టులో చేర్చారు.