యూపీలోని నోయిడాలో ముగ్గురు యువతులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో రెచ్చిపోయి సెక్యూరిటీ గార్డుపై దాడి చేశారు. స్టిక్కర్ లేకపోవడంతో పంకజ్ అనే సెక్యూరిటీ గార్డు ఆ కారును లోపలికి పోనీయలేదు. దీంతో ఫుల్లుగా తాగిన మైకంలో ఉన్న ఆ యువతులు సదరు సెక్యూరిటీ గార్డుపై దుర్భాషలాడారు. అంతటితో ఆగకుండా దాడి చేశారు. సెక్యూరిటీ గార్డు ఫిర్యాదుతో దాడి చేసిన యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.