టెన్నిస్ చరిత్రలో 22 గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ రాఫెల్ నాదల్ ఇంట సంతోషం నెలకొంది. అతని భార్య జిస్కా పెరెల్లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. స్పెయిన్‌లోని మల్లోర్కాలోని ఓ ప్రైవేట్ క్లినిక్‌లో జిస్కా బిడ్డకు జన్మనిచ్చింది. ఈ జంట తమ కుమారుడికి 'రాఫెల్' అని పేరు పెట్టినట్లు సమాచారం. 2005 నుంచి జిస్కాతో నాదల్ లివింగ్ రిలేషన్లో ఉన్నాడు. 14 ఏళ్ల తర్వాత ఇద్దరూ 2019లో పెళ్లి చేసుకున్నారు.