అమరాతి రైతుల రాజధాని ఉద్యమాన్ని కొంతమంది పెట్టుబడిదారులు వెనుక ఉండి నడిపిస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. రాజధాని కోసం అంటూ పాదయాత్రను చేస్తుంది రైతుల్లా కనిపించటం లేదని ఆయన అన్నారు. ఓ ఎజెండా ప్రకారం చంద్రబాబు చెప్పినట్లుగా వారు చేస్తున్నారని విమర్శించారు. కొంతమంది పెట్టుబడిదారులు వెనుక ఉండి నడిపిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వికేంద్రీకరణ ఉద్యమం ఉద్ధతమవుతుందని, వికేంద్రీకరణపై ప్రభుత్వం దేనికైనా సిద్దమే అని మంత్రి స్పష్టం చేశారు. ఓ ప్రాంతానికి సంబంధించిన సెంటిమెంట్ కోసం పెట్టిన పార్టీ టీఆర్ఎస్ చెప్పారు. రాజధాని విషయంలో టీడీపీ నేతలు రైతులను రెచ్చగొట్టి నానా యాగి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని రైతులకు గత ప్రభుత్వం కన్నా ఎక్కువ కౌలు ఇస్తున్నామని, రైతులు తమ ప్రభుత్వం చేసిన తప్పేంటో చెప్పాలని మంత్రి సురేష్ ప్రశ్నించారు. సీఎం జగన్ తీసుకువచ్చిన వికేంద్రీకరణ పరిపాలనను రాష్ట్ర ప్రజలు ఆమోదించారని, ఏపీలో మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.