ఏపీలో అసలు దిశా చట్టం ఉందా? అని సీఎం జగన్ మోహన్ రెడ్డిని మాజీ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. లేని ఆ చట్టం పేరుతో ప్రజల్ని జగన్రెడ్డి మోసం చేస్తున్నారని, నేరాలపై తూతూ ప్రకటనలతో బాధితులకు ఎలాంటి న్యాయం జరగదని లోకేష్ అన్నారు. మాయ మాటలు, కపట ప్రకటనలు ఇకనైనా కట్టిపెట్టాలని, కాకినాడలో యువతిని చంపిన ప్రేమోన్మాదిపై చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఒక్కసారైనా గన్ కంటే ముందు జగన్ వచ్చి.. ఒక్క ప్రాణమైనా కాపాడితే అభినందించాలనుందని నారా లోకేష్ అన్నారు.