ఇచ్చిన హామీ ప్రకారం డ్వాక్రా మహిళలకు గత రెండు సంవత్సరాలుగా మూడు విడతలుగా మహిళల ఖాతాలో నిధులు జమ చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. పెనుమూరు మండలం, సామిరెడ్డిపల్లి పంచాయతీ జట్టు గుండ్లపల్లి , వీరభద్ర కాలనీ లలో గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కే నారాయణస్వామి విలేకరులతో మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, టిడిపి హయాంలో డ్వాక్రా మహిళలు పూర్తిగా నష్టపోయారని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు పెద్ద పీట వేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందని కొనియాడారు కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీలు ఎంపీటీసీలు వైసిపి నాయకులు పాల్గొన్నారు.