ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభివృద్ధి, సంక్షేమం జగనన్న లక్ష్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 10, 2022, 02:27 PM

ఎమ్మిగనూరు: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం సీఎం జగనన్న లక్ష్యం అని వైసీపీ సీనియర్ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ పరిధిలోని 13వవార్డు లోని గడప గడప కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆయన గడప గడప తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మూడేళ్ల పాలనలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు లబ్ది చేకూరిందన్నారు. ఇచ్చిన హామీలను 95శాతం నెరవేర్చారన్నారు.


ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్, కో ఆపరేటివ్ స్టోర్ చైర్మన్ షబ్బీర్ ఆహ్మద్, మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ ఆహ్మద్, కమీషనర్ గంగిరెడ్డి, మైనార్టీ నాయకులు రియాజ్ ఆహ్మద్, పట్టణ అధ్యక్షుడు బుట్టా రంగయ్య, ప్రధాన కార్యదర్శి వీరేంద్ర, కోశాధికారి తారా రాజశేఖర్, టౌన్ బ్యాంక్ చైర్మన్ రాజశేఖర్, కౌన్సిలర్లు, ఇన్ ఛార్జ్ లు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, వాలెంటర్స్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com