విజయనగరం: శృంగవరపుకోట నియోజకవర్గంలో అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప మాలలు వేసుకుని స్వామి దీక్షలను చేపడుతున్నారు. గడచిన దసరా పండుగ మరుసటి రోజు ఏకాదశి పర్వదినాన అయ్యప్ప భక్తులు 41 రోజుల మండల దీక్షలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అయ్యప్పస్వామి దీక్షాపరులు సందడి కోలాహలంగా కనపడుతోంది. భూతల స్నానం, శీతలసయనం, ఒంటిపూట భోజనం, బ్రహ్మచర్యం వంటి కఠోర నియమాలతో అయ్యప్ప స్వామి భక్తులు మండల దీక్షలను చేపడుతున్నారు. ఏ గ్రామంలో చూసిన వేకువజామునే స్వామియే శరణం అయ్యప్ప అనే శరణు ఘోషతో పల్లెలు అయ్యప్పలతో కలకలాడుతున్నాయి. రానున్నది కార్తీక మాసం కావడంతో పట్టణ వాసులతో పాటు పల్లె వాసులు ఆధ్యాత్మిక చింతనతో పరవశిస్తారనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు.