గ్రామాల్లోని ఇళ్లల్లోకి పురుగులు, పాములు వంటివి రావడం సహజం. అయితే గుజరాత్ ఆనంద్ జిల్లా ఖరౌవా ప్రాంతంలో ఆదివారం ఓ ఇంట్లో ఏకంగా మొసలి దూరింది. ఆరు అడుగులు ఉన్న ఆ భారీ మొసలి టాయిలెట్‌లో తిష్ట వేసింది. ఉదయాన్నే టాయిలెట్ డోర్ తీసిన ఆ ఇంట్లోని వారు భయంతో పరుగులు తీశారు. అటవీశాఖ అధికారులు ఆ మొసలిని పట్టుకుని, నిర్మానుష్య ప్రాంతంలో వదిలేశారు. ఈ ప్రాంతంలో తరచూ మొసళ్లు ఇళ్లల్లోకి వస్తున్నాయని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa