టీ20 వరల్డ్ కప్ కి ముందు టీమిండియా కొన్ని ప్రాక్టీస్ మ్యాచులు ఆడనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 158 రన్స్ చేసింది. సూర్యకుమార్ 52 రన్స్ తో రాణించాడు. అనంతరం వెస్టర్న్ ఆస్ట్రేలియా 159 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయింది.