చిత్తూరు, నగరి: నిండ్ర మండలం ఎలాకాటూరు గ్రామ సచివాలయ పరిధిలో ఎలాకాటూరు, ఎలాకాటూరు దళితవాడ, మిట్టూరు గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సోమవారం మంత్రి రోజా పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వ అధికారులుకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.