పేదల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. దేవరపల్లి మండలం చిన్నాయగూడెం గ్రామంలో మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వ అందిస్తున్న పథకాలను అర్హులకు సక్రమంగా అందించేలా అధికార సిబ్బంది పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.