ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి అదుపు తప్పి కింద పడడంతో మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలివి. పరవాడలోని బొంకుదిబ్బ వీధికి చెందిన పూడి ఎరికినాయుడు (52) తాడి సమీపంలో గల బ్లాటింగ్ ప్లాంట్‌లో లోడింగ్, అన్లోడింగ్ విభాగంలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయల్దేరాడు.
స్థానిక ఊర చెరువు సమీపంలోకి వచ్చేసరికి ఆ వాహనం అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతనిని పరవాడ పీహెచ్‌సీకి తీసుకు వెళ్లగా, ప్రథమ చికిత్సల అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతిని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసనమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.