బద్వేల్ టౌన్ సిద్ధవటం రోడ్డు లోని కెనరా బ్యాంక్ నుంచి బద్వేల్ నాలురోడ్ల వరకు కెనరా బ్యాంక్ మేనేజర్ శేషావల్లి, ఫీల్డ్ ఆఫీసర్ ప్రమోద్ , బ్యాంకు సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మీ శ్రేయసే మా బాధ్యత 666 కెనరా బ్యాంక్ ప్రత్యేక డిపాజిట్ పథకము ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు అన్నారు. ఏడాదికి అత్యుత్తమ వడ్డీ లభిస్తుందని 666 రోజులు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని తెలిపారు బ్యాంక్ ఆవరణ నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీగా వెళ్తూ కరపత్రాలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెప్మా కమ్యూనిటీ కో-ఆర్డినేటర్ అయ్యవారయ్య, ఆర్పీలు. డిఆర్డిఏ సీసీలు, ఆనిమేటర్స్ , మరియు బ్యాంక్ మిత్రాలు, తదితరులు పాల్గొన్నారు.