ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం పక్కాగా అమలు జరగాలని అనకాపల్లి కలెక్టర్ రవి పఠాన్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టంపై అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అర్జీదారులు కోరిక మేరకు సమాచారం అందించాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద సహ చట్టం బోర్డులు తప్పనిసరిగా ఉండాలి. సమాచార హక్కు చట్టం పై అధికారులు నిబద్ధతతో పని చేయాలన్నారు.