విశాఖపట్నం: కె. కోటపాడు వైద్య విధాన పరిషత్ ఆస్పత్రిని సోమవారం డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఎమర్జెన్సీ ఎక్సరే స్కానింగ్ రోగులకు అందుబాటులో ఉంచాలన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. 5 కోట్ల 60 లక్షల తో నిర్మిస్తున్న అదనపు భవనాలను డిప్యూటీ సీఎం పరిశీలించారు.