విద్యుదాఘాతంతో బాలికల వసతిగృహం మహిళా వాచ్‌మన్ మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం దయాళ్లోని వెనుకబడినతరగతుల బాలికల వసతిగృహంలో చోటు చేసుకుంది. పాడేరు ప్రాంతానికి చెందిన ఆర్ అమ్మాజీ (35) 2017 నుంచి పెదగంట్యాడ సాంఘిక సంక్షేమ వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహంలో మహిళా వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. సోమవారం వసతిగృహం నిర్వహణ పనులు చేస్తున్నారు. ఇందుకు నీరు అవసరం కాగా హాస్టల్ మేడపై ఉన్న మోటారు స్విచ్ వేసేందుకు వెళ్లిన అమ్మాజీ విద్యుత్తు షాకుకు గురై కిందపడి మృతి చెందారు. వసతి గృహం వార్డెన్ మంగమ్మ ఫిర్యాదు మేరకు న్యూపోర్టు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాo ని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. న్యూపోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.