రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విశాఖ రాక. ఈ మేరకు విజయనగరం శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ట్విట్ పై మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు తగ్గాలంటే విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని కావాలి. ఆ మాత్రం అవగాహన లేకుండా పవన్ ట్విట్ చేయడం హాస్యాస్పదమని కొట్టు ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు వలసలు వెళ్ళి పోతున్నారనే సిఎం విశాఖ ను ఎగ్జిక్యూటివ్ రాజధాని చేయాలనుకుంటున్నారు. అది తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ అని విమర్శించారు. అనంతరం రోడ్డు మార్గాన మంత్రి విజయనగరం బయలుదేరి వెళ్లారు.