దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య అదుపులోనే ఉంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 2,139 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా 1,082 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా మహమ్మారితో పోరాడుతూ 13 మంది చనిపోయారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 26,292కి తగ్గిపోయింది. కోవిడ్-19 రికవరీ రేటు 98.76 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.