ముప్పాళ్ళ మండలంలోని మాదల గ్రామంలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థానాలపై మంగళవారం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 1600 రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.