బంటుమిల్లి మండలంలో గత రెండు రోజులుగా కురు స్తున్న ఎడతెరపిలేని వర్షాలకు పొట్టదశలో ఉన్న వరి పొలాలు నీటిమునగడంతోపాటు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.ఆముదాలపల్లి, నాగేశ్వరరావుపేట, బందకోడు, పెందుర్రు తదితర మైనర్, మీడియం డ్రైన్లలో తూడు, గుర్రపుడెక్కలతో పేరుకుపోయాయి. దీంతో పొలాల్లో నీరు ఎక్కడిద క్కడే నిలిచిపోయింది. రెవెన్యూ అధికారుల సమా చారం మేరకు రెండు రోజులుగా కురుస్తున్న వర్షం దాదాపు 100 మి. మి. నమోదైంది. ఈ వర్షాలకు బంటుమిల్లి బీసీ కాలనీ చుట్టూ నీరు చేరింది. బీఎస్ఆర్ కాలనీ, గణేష్ కాలనీల్లో అంతర్గత డ్రైన్లు లేక వర్గం నీటితో కాలనీ వాసులు ఇబ్బందులు పడ్డారు.బంటుమిల్లి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ వర్షం నీటితో తటాకంలా తయారైంది.జానకిరామపురం గ్రామంలోని బైపాస్ రోడ్డుపై వాన నీరు నిలిచి పోయింది. అధికారులు స్పందించి డ్రైన్లలో పేరుకు పోయిన తూడు తొలగించి మురుగునీరు బయటకు పారడానికి చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.