పత్తికొండ: నియోజకవర్గంలో టమోటా పంటను వేలాది ఎకరాలలో పండిస్తారు. గత కొంతకాలంగా ప్రతిరోజు కురుస్తున్న వర్షాల ప్రభావం టమోటా పంటపై పడింది. వర్షాల వల్ల టమోటా త్వరగా కుల్లడం, మచ్చ తెగులు రావడంతో టమోటాలను వ్యయ ప్రయాసలు కోర్చి మార్కెట్ కు తరలిస్తే, కొనుగోలు చేయడానికి వ్యాపారులు, దళారీలు వెనుకంజ వేస్తుండటంతో టమోటా రైతులు లబోదిబో మన పరిస్థితి ఏర్పడింది. టమోటా పంటపై మచ్చ తెగులు ప్రభావం అధికంగా పడటంతో రైతుల పరిస్థితి గోరుచుట్టుపై రోకటి పోటులా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి టమోటా పంటకు గిట్టుబాటు ధర కల్పించి, ప్రభుత్వ కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని రైతాంగం కోరుతున్నారు.