శ్రీశైలం ప్రాజెక్టులోకి ఎగువ నుండి బుధవారం వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రాజెక్టులోకి ఎగువ నుండి 1, 26, 289 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు 2 గేట్లు 10 అడుగుల మేర పైకెత్తి నీటిని దిగకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ కాలువలు, జల కేంద్రం ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్ట సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884. 80 అడుగుల నీరు నిల్వ ఉంది.