గాండ్లపెంట మండలం వేపరాళ్ల గ్రామ సచివాలయం పరిధిలోని జీనులకుంట వలసవాండ్లపల్లి గ్రామాలలో కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్దా రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సమస్యలను తెలుసుకొని అక్కడే గల ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించారు. గతంలో 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రజలకు మేలు చేయలేదన్నారు.