శ్రీసత్య సాయి జిల్లా మడకశిర మండలం భక్తరపల్లి గ్రామంలో శ్రీమారేమ్మ దేవి ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నరసింహారాజ, కార్యదర్శి పుల్లయ్య చౌదరి, సర్పంచ్ రామాంజనేయులు, రవీంద్ర రెడ్డి, మాజీ డీలర్ హనుమంతారాయప్ప, రామచంద్రప్ప, కన్నా, రామకృష్ణ, తిమ్మరాజు, వెంకటరాజు, అక్కంపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పాల్గొన్నారు.