ఒంటిపై పెట్రోల్ పోసుకొని దంపతులు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరులో డ్రైనేజీని బ్లాక్ చేసేలా ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. కేఆర్ పురంలోని ఎస్ఆర్ లేఅవుట్లో ఉన్న ఓ అక్రమ నివాసాన్ని కూల్చేందుకు బుల్డోజర్తో వెళ్లారు. అయితే ఈ ఇంటి యజమానులైన భార్యాభర్తలు దీన్ని అడ్డుకున్నారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంటనే అపారు. వారిపై నీళ్లు పోశారు. అయితే తమది అక్రమ నిర్మాణం కాదని, అన్ని పత్రాలున్నాయని ఆ దంపతులు చెబుతున్నారు. కానీ వారు మురుగు, వర్షం నీరును బ్లాక్ చేసేలా డ్రైనేజీ కాలువపై ఇంటిని కట్టారని అధికారులు తెలిపారు.