బీహార్‌లో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. చప్రా-సివాన్ హైవేపై పోలీసు సిబ్బందితో వెళ్తున్న ఓ బస్సును బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు ఎగిరి రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతిచెందారు. బైక్ డ్రైవ్ చేస్తున్న యువకుడు బైక్‌తో సహా బస్సు కిందకు దూసుకెళ్లాడు. బైక్ తో సహా బస్సు 100 మీటర్ల దూరం ప్రయాణించింది. ఈ క్రమంలోనే ఇంధన ట్యాంక్ పేలి మంటలు అంటుకున్నాయి. దీంతో బస్సు కింద చిక్కుకున్న యువకుడు సజీవదహనమయ్యాడు. ఈ ప్రమాద దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.