అస్తమించిన టీడీపీని లోకేష్‌కు అప్పజెప్పడానికే పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్‌ను రైతులతో తిట్టిస్తున్నారని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఆఖరికి విశాఖ నగరంపై కూడా టీడీపి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా గుడివాడ 33వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కొడాలి నాని టీడీపీ, జనసేనపై విరుచుకుపడ్డారు.