మంగళగిరి నగరంలో నిర్మించిన టిడ్కో గృహాలని ఈనెల 15న లబ్ధిదారులకు అప్పగించనున్నట్లు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఈ మేరకు నగరంలోని కార్పోరేషన్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టిడ్కో గృహాల మౌలిక సదుపాయాల పనులు చివరి దశకు చేరుకున్నాయని ఈ నెల 15 న గృహాలని అప్పగించనున్నట్లు వెల్లడించారు. అలానే డీడీలు చెల్లించి టిడ్కో గృహాలు మంజూరు కాని పేదలకు వారు చెల్లించిన సుమారు రూ. 4. 15 కోట్ల నగదు తిరిగి చెల్లింపు చేస్తున్నట్ల చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, కార్పోరేషన్ అడిషనల్ కమిషనర్ హేమామాలిని తదితరులు పాల్గొన్నారు.