దోర్నాల పట్టణంలోని వైయస్సార్ విగ్రహం వద్ద గ్యాస్ సిలిండర్ అదుపుతప్పి మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల జనాలు భయాందోళన చెందారు. ఈ సంఘటన వివరాలు ప్రకారం మొక్కజొన్న కందులు తోపుడు బండి పై గ్యాస్ సిలిండర్ ద్వారా ఉడికించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న ఈ సిలిండర్ అదుపుతప్పి ఒక్కసారిగా మంటలు చేలరేగడంతో కొంతసేపు వరకు నటరాజ్ సెంటర్ లో భయాందోళన గురి అయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వారు వచ్చి మంటలు అదుపు చేశారు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో చోటు చేసుకున్నది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa