వీరబల్లి మండలం మట్లి గ్రామం యల్లంపల్లిలో త్రాగు నీటి బోరు దెబ్బతిన్నట్లు స్థానికులు సర్పంచ్ సోమారపు నాగార్జునాచారి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన సర్పంచ్ మరమ్మత్తులు చేయించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజలకు కావాల్సిన సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. బోరు దెబ్బతిని ప్రజలు త్రాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి తేవడం జరిగిందన్నారు. దింతో ప్రజలు ఇబ్బందులు గుర్తించి సమస్యను వెంటనే పరిష్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు భూషణ్ నాయుడు, రామయ్య తదితరులు పాల్గొన్నారు.