ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగనన్న పాలన సాగుతుందని రాయచోటి ఏమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రామాపురం ఎంపీడీవో సభా భవనంలో బుధవారం మండల అధ్యక్షురాలు గడికోట విజయలక్ష్మి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సర్పంచులు ఎంపీటీసీలు ఎమ్మెల్యేని శ్రీకాంత్ రెడ్డిని ఎంపీపీ విజయలక్ష్మి ఘనంగా సన్మానించారు అనంతరం మండలంలోని అన్ని శాఖల వారిగా సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండల సర్వసభ్య సమావేశానికి ప్రతి ఒక్క అధికారి తమ శాఖ యొక్క పూర్తిస్థాయి సమాచారంతో హాజరు కావాలన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి జగనన్న ఇల్లు ఒక్కరోజులోనే మంజూరు చేయడం జరుగుతుందన్నారు. లబ్ధిదారునికి సొంత స్థలం ఉంటే వెంటనే ఇల్లు నిర్మించుకోవచ్చు అన్నారు. కాలేటి వాగు నుంచి రామాపురం మండలంలోని 82 చెరువులకు గాను 41 చెరువులు మరమ్మత్తులు చేస్తున్నట్లు ఇరిగేషన్ ఏఈ సభ దృష్టికి తీసుకు వచ్చారు మిగిలిన చెరువులు కూడా త్వరితగదినం పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ప్రతి ఇంటికి నీరు అందించాలనే సంకల్పంతో నే రాష్ట్ర ప్రభుత్వం జలజీవన పథకాన్ని ప్రవేశపెట్టిందని సర్పంచులు ఈ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు.