యోగి వేమన విశ్వవిద్యాలయం మెటీరియల్స్ సైన్స్ అండ్ నానోటెక్నాలజీ విభాగం పరిశోధన విద్యార్థి ఉరుపల్లి భార్గవ్ కు వైవీయూ డాక్టరేట్ ను ప్రకటించింది. ఈయన మెటీరియల్స్ సైన్స్ అండ్ నానోటెక్నాలజీ శాఖ సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం. మమత కుమారి పర్యవేక్షణలో " టంగ్స్టన్ ఆక్సైడ్ బేస్డ్ నానో స్ట్రక్చర్డ్ జెడ్ స్కీమ్ హెటరోజంక్షన్స్ ఫర్ ఫోటోకేటలిస్ట్ హెచ్ టు ఎవల్యూయేషన్ అండర్ సోలార్ లైట్ ఇరాడియేషన్ అనే అంశంపై పరిశోధన చేశారు. వైవీయు వీసీ ఆచార్య ఎం. సూర్యకళావతి ఆదేశాల మేరకు నియమితులైన నిపుణుల బృందం ఊరుపల్లి భార్గవ్ రూపొందించిన పరిశోధన గ్రంధం అద్యయనం చేసి డాక్టరేట్ కు అర్హత ఉందంటూ నిర్దరించారు.