రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కే చెందుతుందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. బుధవారం చెన్నూరు మండల పరిధిలోని ముండ్లపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి గడపగడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఆ ఇంటికి ఎంత లబ్ధికూరిందో వివరిస్తూ వారి సమస్యల అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. ఎంపిడిఓ జాన్ వెస్లీ, ట్రాన్స్ కో ఏఇ రామలింగారెడ్డి, సచివాలయ ఉద్యోగులు, ఎంపిపి చీర్ల సురేష్ యాదవ్, నాయకులు జియన్ భాస్కర్ రెడ్డి, మాసీమ బాబు, పాండురంగారెడ్డి, అన్వర్ భాషా, అన్వేష్, రవీంద్రనాథ్ రెడ్డి, వారిస్, లావణ్య, రఘురామిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.